Jagga reddy:  “కేటీఆర్ అనుభవం శూన్యం.. తండ్రి సీటుతో ఎమ్మెల్యే అయ్యాడు!”

Jagga reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ ఇచ్చిన సీటుతో ఎమ్మెల్యే అయ్యాడు. కానీ మేమంతా రాజకీయాల్లో ఎన్నో కష్టాలు పడుతూ, వ్యయప్రయాసలతో ఎదిగాం. మా అనుభవంతో పోలిస్తే కేటీఆర్ అనుభవం శూన్యం” అని ఆయన వ్యాఖ్యానించారు.

“కేటీఆర్ ఓ సర్పంచ్‌గా కూడా గెలవలేదంటే ఆయన ప్రజా జీవిత అనుభవం ఏమిటి?” అని ప్రస్తావించారు. “కేటీఆర్ జడ్పీటీసీగానైనా పోటీ చేశాడా?” అని ప్రశ్నించారు.”విదేశీ పర్యటనల్లో ఎం చేస్తున్నారు చెప్పాలన్నా కేటీఆర్‌కు స్పష్టత లేదు. ఆయన నోరు విప్పితే అబద్దాలే.” అని మండిపడ్డారు.”సీఎంను గోకడం, తన్నిపిచ్చుకోవడం ఎందుకు? ఐదేళ్లు పాలన చేయాలని ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు.” అని స్పష్టం చేశారు.

అలాగే జగ్గారెడ్డి హెచ్చరిక లాంటిగా పేర్కొన్నారు –

“మీరు మాట్లాడే విధానాన్ని బట్టే మేము స్పందిస్తాం. రాజకీయ విమర్శలు శ్రద్ధగా ఉండాలి గాని, వ్యక్తిగత విమర్శలు ఒప్పుకోలేం.” ఇలాంటి ఘాటు వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ముందుగా కేటీఆర్, తర్వాత జగ్గారెడ్డి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ సవాళ్లకు దిగడం, అధికార-ప్రతిపక్ష మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *