Jagga reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ లేఖ బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించి, బీజేపీకి లాభం చేకూర్చేలా ఉందని ఆయన ఆరోపించారు.
జగ్గారెడ్డి వ్యాఖ్యలు:
కవిత తన ఉనికి కోసమే రాహుల్ గాంధీపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు.
“పింక్ బుక్” పేరుతో రేవంత్ రెడ్డిని కవిత అనవసరంగా రెచ్చగొడుతున్నారని, గతంలో నరేంద్ర మోడీని రెచ్చగొట్టడం వల్లే నాలుగు నెలలు జైలు పాలయ్యారని పేర్కొన్నారు.
కవిత తన తండ్రి కేసీఆర్‌ను దేవుడిగా అభివర్ణిస్తూ, రాజకీయంగా ఆయనను సమాధి చేసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
కవిత డిప్రెషన్‌లో ఉండి ఈ లేఖ విడుదల చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కవిత లేఖలు, లీకులు కేవలం మీడియా వార్తలకే పరిమితమవుతాయని, అవి పార్టీ మనుగడను దెబ్బతీస్తాయన్న నిజాన్ని గ్రహించాలని సూచించారు.
తెలంగాణలో నాయకత్వం లేని బీజేపీకి బీఆర్ఎస్ నేతలే పరోక్షంగా బలాన్ని చేకూరుస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ లోతైన ఆలోచనాపరుడు అని, బహుశా తన పిల్లలు దారి తప్పుతున్నారని ఆయన భావిస్తున్నట్లుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
కవిత కేసీఆర్ కుమార్తె కావడం వల్లే మీడియా అంత ప్రాధాన్యత లభిస్తోందని, ఆమె రాష్ట్ర రాజకీయాలను ఏదో తిప్పేస్తుందనుకోవడం భ్రమ అని అన్నారు.
కవిత రాస్తున్న లేఖలు తమ రాజకీయ శత్రువైన బీజేపీకి ఉపయోగపడతాయన్నదే తమ ఆందోళన అని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ వైపు ఆకర్షించేందుకు తగిన వ్యూహాన్ని పీసీసీ, ముఖ్యమంత్రితో చర్చించి అమలు చేస్తామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు.