Jagapathi Babu

Jagapathi Babu: పెద్దిలో.. రంగస్థలం సర్పంచ్

Jagapathi Babu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణలో ఉంది. ఇటీవల ఢిల్లీ పరిసరాల్లో కీలక సన్నివేశాలను షూట్ చేసిన చిత్ర బృందం, సినిమాను అనుకున్న సమయానికే అంటే.. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు శరవేగంగా పనులు పూర్తి చేస్తోంది.

అప్పలసూరిగా ‘జగ్గు భాయ్’ విశ్వరూపం

తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో నటిస్తున్న వెర్సటైల్ నటుడు జగపతిబాబు ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. నిజం చెప్పాలంటే, ఆ ఫోటో చూసిన తర్వాత ఆయన జగపతిబాబేనా? అని సందేహం కలగక మానదు. సాధారణంగా మాస్ లేదా క్లాస్ పాత్రల్లో ఒకే తరహా గడ్డం, హెయిర్ స్టైల్‌తో కనిపించే ఆయన, ఈ సినిమాలో ‘అప్పలసూరి’ అనే పాత్ర కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు. ఈ పాత్ర తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయి? ఆయనది పాజిటివ్ రోలా లేక విలనిజమా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

టెక్నికల్ హైలైట్స్.. వైరల్ సాంగ్స్!

‘ఉప్పెన’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు తీస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏఆర్ రెహమాన్ తన మ్యూజిక్‌తో మరింత పెంచేశారు. ఇటీవల విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాను ఊపేస్తోంది. రామ్ చరణ్ సరసన అందాల భామ జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ లెజెండ్ శివరాజ్ కుమార్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *