Jagannath Rath yatra: ఒడిశా రాష్ట్రంలోని ప్రసిద్ధమైన పూరీ జగన్నాథస్వామి రథయాత్ర శుక్రవారం (జూన్ 27న) ప్రారంభమైంది. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వేడుకను చూసేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాదిగా భక్తజనం తరలివచ్చింది. భక్తజనం ఈ యాత్రలో జగన్నాథస్వామితోపాటు సోదర సోదరీమణులైన బలభద్రుడు, సుభద్రకు చెందిన రథాలను లాగుతారు. ఈ ముగ్గురు దేవతల రథాలను ముందుగా గుండిచా ఆలయానికి తీసుకెళ్లి కొంత సేపు అక్కడే ఉంచుతారు. ఆ తర్వాత జగన్నాథస్వామి ఆలయానికి తీసుకొస్తారు.
Jagannath Rath yatra: ఈ యాత్రకు లక్షలాది భక్తులు తరలి వస్తారనే ఉద్దేశంతో భద్రతా చర్యలను భారీగా ఏర్పాటుచేశారు. రథయాత్ర విధుల్లో సుమారు 10 వేల మంది భద్రతా సిబ్బందిని ఉంచారు. ఒడిశా పోలీసులు సహా సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్స్ (సీఏపీఎఫ్)కు చెందిన 8 కంపెనీల జవాన్లు ఉన్నారు. నిఘా కోసం పూరీ పట్టణంలో 250కిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఎనేబుల్ కెమెరాలను అమర్చారు. అయితే రథయాత్ర సందర్భంగా
Jagannath Rath yatra: తొలి రోజైన శుక్రవారం సుమారు 15 లక్షల మంది భక్తులు రథయాత్రలో పాల్గొంటారని అంచనా వేస్తున్నట్టు పూరీ ఆలయ నిర్వాహకులు, పోలీసు అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కోసం ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. రథయాత్ర దృష్ట్యా ఒడిశాలోని సముద్ర తీరంలోనూ భద్రతను పెంచారు. ఒడిశా మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డులు సహా నావికాదళ సిబ్బంది కూడా భద్రతా చర్యల్లో పాల్గొన్నట్టు తెలిపారు.
Jagannath Rath yatra: రథయాత్రల భద్రత కోసం ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేసినట్టు ఒడిశా రాష్ట్ర డీజీపీ వైబీ ఖురానియా, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఆర్పీ కోచే తెలిపారు. గుండిచా ఆలయం, జగన్నాథ, బలభద్ర, సుభద్ర రధాల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. రథయాత్ర వేళల్లో ప్రత్యేకంగా భవనాలపై ఎన్ఎస్‌జీ స్నిప్పర్ కమాండోలను మోహరించామని చెప్పారు. భద్రతా చర్యల్లో యాంటీ-డ్రోన్ టెక్నాలజీని వాడుతున్నామని, పోలీసులు నిరంతర పర్యవేక్షణ కోసం డ్రోన్‌లను మోహరించారని తెలిపారు. యాంటీ సాబోటేజ్, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లను రంగంలోకి దించామని వివరించారు.

