Jagan: ఆస్తుల కేసుల విచారణ నేపథ్యంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇవాళ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జగన్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది. చివరిసారిగా ఆయన 2020, జనవరి 10న కోర్టు ముందుకు వచ్చారు.
కోర్టు ఆదేశాల మేరకు నేడు జగన్ 11 ఛార్జ్ షీట్ల విచారణలో భాగంగా వ్యక్తిగతంగా హాజరవుతున్నారు. కాసేపటి క్రితం బేగంపేట విమానాశ్రయంకి చేరుకున్న జగన్.
బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లి కోర్టుకు వెళ్లే దారి పొడవునా వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులు భారీగా తరలివచ్చి వచ్చారు. ట్రాఫిక్ కి త్రీవ్ర ఇబ్బంది కలిగించారు. జగన్ రావడంతో కోర్టు పరిసరాల్లో భారీ బందోబస్తు, ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
జగన్ మోహన్ రెడ్డి రాక నేపథ్యంలో నాంపల్లి సీబీఐ కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టుకు చేరుకునే రెండు ప్రధాన మార్గాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. న్యాయవాదులకు మాత్రమే కోర్టు లోపలికి అనుమతి ఇస్తున్నారు. కోర్టు గేటును మూసివేసి, పటిష్టమైన భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
