Jagadekaveerudu Athilokasundari: మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన క్లాసిక్ హిట్ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది! మే 9న ఈ చిత్రం గ్రాండ్ రీ-రిలీజ్ కానుంది. ఈసారి సినిమాను 3D మరియు 8K క్వాలిటీలో రీమాస్టర్ చేశారు.
భారతదేశంలోనే తొలిసారిగా 8Kలో రీ-రిలీజ్ అవుతున్న చిత్రంగా రికార్డు సృష్టించింది. 8 కోట్ల రూపాయలతో ఈ రీమాస్టరింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేశారు. 1990లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.
Also Read: Adnan Sami: అద్నాన్ సమి సంచలన వ్యాఖ్యలు పాక్ ఆర్మీపై యువత ఆగ్రహం!
Jagadekaveerudu Athilokasundari: చిరంజీవి యాక్షన్, శ్రీదేవి అందం, రాఘవేంద్రరావు డైరెక్షన్‌తో పాటు ఇళయరాజా సంగీతం అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పుడు కొత్త టెక్నాలజీతో సినిమా మరింత విజువల్ ట్రీట్ ఇవ్వనుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ రీ-రిలీజ్ గురించి హైప్ షురూ అయ్యింది.