Jack Twitter Review

Jack Twitter Review: జాక్ మూవీ ట్విట్టర్ రివ్యూ..ఈసారి సిద్ధు మేజిక్ వర్కౌట్ అయ్యిందా

Jack Twitter Review: డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత యూత్ ఐకాన్‌గా ఎదిగిన సిద్దు జొన్నలగడ్డ తాజా మూవీ జాక్. స్పై యాక్షన్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సిద్దుకు జోడీగా బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటించింది. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు.

టిల్లు వర్సెస్ జాక్ అనేలా రెండు విభిన్న జానర్స్‌లో వరుసగా నటిస్తున్న సిద్ధు ఈసారి సీరియస్ యాక్షన్, హ్యూమర్ మిక్స్‌తో మాస్‌కి దగ్గర అయ్యేలా ట్రై చేశాడు. ట్రైలర్, టీజర్‌ నుంచే సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అయింది. స్పెషల్‌గా ట్రైలర్‌లోని డైలాగ్స్, యాక్షన్ ఎలిమెంట్స్ యూత్‌ను బాగా ఆకట్టుకున్నాయి.

ఇది కూడా చదవండి: Virgin Boys: నవ్వుల జల్లు కురిపించేందుకు సిద్ధమైన ‘వర్జిన్ బాయ్స్’!

తాజాగా సినిమా ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోలు ప్రారంభమవడంతో ఆడియెన్స్ టాక్ బయటకు వచ్చింది. ఫస్ట్ హాఫ్ కామెడీ, యాక్షన్ మిక్స్‌తో పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిందన్న టాక్ వినిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో కథ కొంచెం సీరియస్ మోడ్‌కు వెళ్లినా, చివర్లో ట్విస్ట్‌తో అందరినీ సర్‌ప్రైజ్ చేసినట్లు సోషల్ మీడియా లో కామెంట్స్ వస్తున్నాయి.

సిద్ధు స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, పంచ్ డైలాగ్స్ మరోసారి బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే వైష్ణవి చైతన్య కూడా తన పాత్రకు న్యాయం చేసింది. మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్ అని అంటున్నారు.

మొత్తానికి ‘జాక్’ సినిమాకు ఓవర్సీస్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం చూసి, టాలీవుడ్ ఆడియెన్స్‌కి కూడా ఈ సినిమా కనెక్ట్ అవుతుందనిపిస్తుంది. మాస్, క్లాస్ – రెండింటినీ ఆకట్టుకునే కంటెంట్ ఉందని ప్రీమియర్ టాక్ చెబుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *