Giorgia meloni-Modi

Giorgia meloni-Modi: మీ బలం.. సంకల్పం స్ఫూర్తిదాయకం.. ప్రధాని మోదీకి నెతన్యాహు స్పెషల్‌ విషెస్‌

Giorgia meloni-Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా దేశ, విదేశాల నుంచి శుభాకాంక్షల జల్లు కురుస్తోంది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, సామాన్య ప్రజలతో పాటు ప్రపంచ నాయకులంతా మోదీకి బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు.

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రత్యేక సందేశం పంపించారు. మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, “మీ బలం, సంకల్పం లక్షలాది మందికి స్ఫూర్తిదాయకం. భారతదేశాన్ని ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించగల శక్తి మీకు కలగాలని కోరుకుంటున్నాను” అని రాశారు. ఈ సందర్భంగా మోదీతో ఉన్న ఓ ఫోటోను ఆమె ఎక్స్‌లో షేర్ చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రాత్రే మోదీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సుంకాల సమస్యలతో రెండు దేశాల మధ్య సంబంధాలు కాస్త తగ్గిన తరుణంలో, మళ్లీ మోదీ-ట్రంప్ సంభాషణ జరగడం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. “మోదీ నా మంచి స్నేహితుడు” అని ట్రంప్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Khalistani Groups: భారత కాన్సులేట్‌ను సీజ్‌ చేస్తాం.. ఖలిస్థానీల బెదిరింపులు

ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. “మై డియర్ గుడ్ ఫ్రెండ్ నరేంద్ర.. మీరు భారత్ కోసం ఎంతో సాధించారు. భారత్-ఇజ్రాయెల్ మధ్య భాగస్వామ్యం మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలి. త్వరలో మిమ్మల్ని కలిసేందుకు ఎదురు చూస్తున్నాను” అని అన్నారు.

అలాగే ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్, యూకే మాజీ ప్రధాని రిషి సునాక్ కూడా మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌తో ఉన్న బలమైన స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు. భూటాన్ ప్రధాని సహా పలు దేశాల నేతలు కూడా తమ హృదయపూర్వక విషెస్‌ను తెలిపారు.

ప్రపంచ నాయకులు ఒకే స్వరంతో మోదీ నాయకత్వాన్ని, భారత్‌తో ఉన్న అనుబంధాన్ని కొనియాడుతుండగా, దేశంలోనూ శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. మోదీకి ఇది మరొక గుర్తుండిపోయే పుట్టినరోజుగా నిలిచిపోనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *