ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. నవంబర్ 2న ఎల్‌వీఎం3-ఎం5 బాహుబలి రాకెట్ ద్వారా సీఎంఎస్ 03 ఉపగ్రహం ప్రయోగానికి సిద్ధమైంది. 4,400 కిలోల బరువు ఉన్న జీసాట్-7ఆర్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నరు. తిరుపతి జిల్లా సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో లాంచ్ ప్యాండ్ నుంచి దీనిని ప్రయోగించనున్నది.
ISRO: శ్రీహరికోటలోని వెహికిల్ అసెంబ్లింగ్ భవనంలో రాకెట్ అనుసంధాన పనులను పూర్తిచేశారు. వాహన నౌకను లాంచ్ ప్యాడ్‌కు విజయవంతంగా తరలించారు. జీసాట్-7ఆర్ ఉపగ్రహం 36,000 కిలోమీటర్ల ఎత్తులోని జీటీవో ఆర్బిట్‌లోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే సన్నాహాలను పూర్తిచేశారు.
ISRO: ఇది ప్రయోగం విజయవంతమైతే మారుమూల ప్రాంతాలతో సహా దేశవ్యాప్తంగా మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించడానికి వీలు కలుగుతుంది. దీంతో మరో మైలురాయిని అందుకోనున్నట్టు శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఇస్రో ప్రయోగాల పరంపరలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో నానాటికీ ముందడుగు వేస్తూ దూసుకెళ్తుంది.

