Netanyahu: పశ్చిమ ఏసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పాలస్తీనాను దేశంగా గుర్తించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. జోర్డాన్ నది పశ్చిమాన ఇకపై పాలస్తీనా రాజ్యం ఉండదని, ఇజ్రాయెల్‌కు మధ్యలో ఉగ్రవాద రాజ్యాన్ని బలవంతంగా స్థాపించడానికి జరుగుతున్న ప్రయత్నాలను తాము అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.
