Israel

Israel: సరికొత్త యుద్ధానికి తెర తీస్తున్న ఇజ్రాయెల్.. ఈసారి సముద్రం పొంగుతుంది!

Israel: చిన్న దేశం.. పెద్ద యుద్ధ తెలివి. యుద్ధంలో ఎన్నిరకాల అస్త్రాలు తీయాలో ఇజ్రాయేల్ కు తెలిసినట్టు మరెవరికీ తెలియదేమో అనిపించేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. నింగి.. నేల క్షిపణుల వర్షంతో తడిపేస్తున్న ఇజ్రాయేల్ కొత్తగా సముద్రం నుంచి విరుచుకుపడబోతున్నానని హెచ్చరిస్తోంది. అవును.. లెబనాన్‌లోని దక్షిణ తీర ప్రాంతంలో త్వరలో కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

లెబనీస్ ప్రజలు బీచ్‌లకు దూరంగా ఉండాలని సైన్యం సూచించింది. వార్తా సంస్థ ఏపీ ప్రకారం, మధ్యధరా సముద్రానికి ఆనుకుని ఉన్న 60 కిలోమీటర్ల వరకు మత్స్యకారులు వెళ్లవద్దని హెచ్చరించారు. దీంతో ఇప్పుడు సముద్రంలో ఇజ్రాయేల్ ఏమి చేస్తుంది అనే ఆసక్తి కలుగుతోంది. అదేసమయంలో యుద్ధంలో కొత్త కొత్త స్ట్రాటజీలు చేస్తున్న ఇజ్రాయేల్ ను నిలువరించడం ఎలా అనేది లెబనాన్ టెన్షన్ పడుతోంది. 

సోమవారం ఒక గంట వ్యవధిలో దక్షిణ లెబనాన్‌లోని 120కి పైగా హిజ్బుల్లా స్థానాలను తాకినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ దాడిలో కనీసం 10 మంది అగ్నిమాపక సిబ్బంది మరణించారు. ఇది కాకుండా ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉన్నారు.

వైమానిక దాడులతో పాటు, ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థానాలకు వ్యతిరేకంగా భూ కార్యకలాపాలను కూడా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. లెబనాన్‌లో జరిగిన భూసేకరణలో ఇప్పటివరకు 11 మంది ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు, హిజ్బుల్లా సోమవారం 190 రాకెట్లను ప్రయోగించారని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. ఈ ఘటనలో కనీసం 9 మంది గాయపడ్డారు. దీంతోపాటు ప్రాథమిక సేవలు కూడా దెబ్బతిన్నాయి. హైవేపైనా, పలు ఇళ్లపైనా ప్రత్యక్ష దాడులు జరిగాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *