Ram Charan-Trivikram

Ram Charan-Trivikram: రామ్ చరణ్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌ ఇక లేనట్టేనా?

Ram Charan-Trivikram: సినీ అభిమానులకు షాకింగ్ అప్‌డేట్! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా లైనప్‌లో ఊహించని మలుపు. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా కోసం చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పక్కనపెట్టారు. రామ్ చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే సుకుమార్‌తో మరో భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు.

అయితే, అసలు ట్విస్ట్ ఇదే! సుకుమార్ సినిమా తర్వాత రామ్ చరణ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్ దాదాపు ఖాయమైనా, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్రివిక్రమ్ కథ రామ్ చరణ్‌కు నచ్చినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. భవిష్యత్తులో ఈ జోడి కలిసే అవకాశం ఉందా? లేదా? అనేది సస్పెన్స్‌గా మిగిలిపోయింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Sreeleela: శ్రీలీల సినిమాకి అడ్డంకులు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *