Harihara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ దశలోనే అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఇప్పుడు రిలీజ్ డేట్ విషయంలో కొత్త సమస్యలు తలెత్తాయి.
చిత్రం పూర్తి కాకముందే ఓటీటీ రైట్స్ భారీ ఒప్పందం కుదిరింది. మొదట రూ.75 కోట్లకు డీల్ ఫిక్స్ అయినప్పటికీ, విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఓటీటీ సంస్థ ఒప్పందాన్ని రూ.65 కోట్లకు తగ్గించింది.
Also Read: Suriya 45: సూర్య 45 టైటిల్ రివీల్: ‘కరుప్పు’తో మాస్ ఎంటర్‌టైనర్ సిద్ధం!
Harihara Veeramallu: ఇప్పుడు మరో రూ.5 కోట్లు తగ్గించేందుకు పట్టుబడుతోందట. నిర్మాతలు దీనికి వ్యతిరేకిస్తుండటంతో రిలీజ్ డేట్ ఖరారు కావడం లేదు.ఈ గందరగోళం మధ్య చిత్ర బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అభిమానులు మాత్రం సినిమా త్వరగా విడుదల కావాలని కోరుకుంటున్నారు.

