Kantara: ‘కాంతార’ విజయ తాకిడితో సినీ ప్రపంచాన్ని ఆకట్టుకున్న రిషబ్ శెట్టి మరోసారి సందడి చేయనున్నాడు. ‘కాంతార: చాప్టర్ 1’ ప్రీక్వెల్‌గా రూపొందుతూ, కదంబ రాజవంశ బ్యాక్‌డ్రాప్‌లో ఆధ్యాత్మిక కథాంశంతో ఆకర్షిస్తోంది. గాంధీ జయంతి, దసరా సందర్భంగా అక్టోబర్ 2న భారీ విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంలో రిషబ్ నాగ సాధువుగా అతీంద్రియ శక్తులతో మెస్మరైజ్ చేయనున్నాడు.జయరామ్, కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
500 మంది ఫైటర్స్‌తో చిత్రీకరించిన యుద్ధ సన్నివేశం సినిమాకి హైలైట్‌గా నిలవనుంది. హోంబలే ఫిల్మ్స్ ‘కాంతార’ను సినిమాటిక్ యూనివర్స్‌గా మార్చే దిశగా ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రం విడుదల సమయంలో మూడో సినిమా ప్రకటన కూడా రానుందట.
Also Read: Ravi Teja: సూపర్ హీరో అవతారమెత్తబోతున్న రవితేజ?
Kantara: కర్ణాటక సంప్రదాయాలు, ఆధ్యాత్మికతతో కూడిన కొత్త కథతో మూడో భాగం రూపొందనుంది. రిషబ్ కలరిపయట్టు, కత్తి పోరాటం, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకున్నాడు. కుందాపురలోని చారిత్రక సెట్‌లో షూటింగ్ జరుగుతుంది. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా సంచలనం సృష్టించడం ఖాయం.