Harihara Veeramallu

Harihara Veeramallu: హరిహర వీరమల్లు వివాదం.. పవన్ సినిమాపై కుట్ర?

Harihara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ కథానాయికగా జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ కాకుండా ఆగిపోయిన ఈ సినిమా చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. థియేటర్లు ఊహించని విధంగా మూతపడడం సినీ వర్గాల్లో కలకలం రేపింది. మొదట, సినిమా విడుదలలో అడ్డంకులు లేవని చెప్పినప్పటికీ, ఫిల్మ్ ఛాంబర్ సమావేశం సానుకూలంగా ముగియకపోవడం కొత్త ట్విస్ట్‌గా నిలిచింది.

Also Read: Ram Charan: రామ్ చరణ్ తో మున్నాభాయ్.. పెద్ది సెట్స్ లో జోరు!

Harihara Veeramallu: ఈ గందరగోళం వెనుక నలుగురు నిర్మాతల కుట్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాను కావాలనే ఆపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఈ వివాదంపై విచారణకు ఆదేశించారు. అసలు కారణాలను కనుగొనేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పరిణామాలతో సినిమా విడుదలపై సస్పెన్స్ మరింత రసవత్తరంగా మారింది. ఇంతకీ ఈ డ్రామాకు ముగింపు ఎలా ఉంటుంది? అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

WordsCharactersReading time

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *