Saiyara

Saiyara: సైయారా: సిద్ధార్థ్, కియారా ఫస్ట్ ఛాయిస్?

Saiyara: మోహిత్ సూరి డైరెక్షన్‌లో వచ్చిన సైయారా సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అయితే, ఈ సినిమాకు మొదటి ఎంపికగా బాలీవుడ్ స్టార్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీలను ఆలోచించారట దర్శకుడు. కానీ, చివరకు ఈ చిత్రంలో కొత్త నటులు అహాన్ పాండే, అనీత్ పడ్డా నటించారు.

Also Read: Avatar: సంచలనం సృష్టిస్తున్న అవతార్: ఫైర్ అండ్ యాష్ ట్రైలర్!

మోహిత్ సూరి రొమాంటిక్ డ్రామా సైయారా సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ చిత్రంలో అహాన్ పాండే, అనీత్ పడ్డా కొత్త నటులుగా నటించి అందరినీ ఆకట్టుకున్నారు. కానీ, ఈ సినిమాకు మొదట సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీలను ఎంచుకున్నారని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. షేర్‌షా సినిమాతో ఆకట్టుకున్న ఈ జంటను తీసుకోవాలని మోహిత్ మొదట భావించారట. అయితే, చర్చలు కొలిక్కి రాకపోవడంతో కొత్త నటులతో సినిమాను రూపొందించారు. కట్ చేస్తే సైయారా బాక్సాఫీస్ వద్ద 250 కోట్లు దాటి సంచలనం సృష్టిస్తోంది. నిర్మాతలకు లాభాల పంట పండిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *