Thaman: మనిషిని పోలిన మనుషులు ఏడుగురే ఉంటారేమో కానీ.. సంగీత ప్రపంచంలో పాటను పోలిన పాటలు ఎన్నుంటాయి?.. చెప్పలేం కానీ ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి క్షణాల్లో చెప్పెయ్యొచ్చు.. అట్లీ, విజయ్ తో తీసిన తేరి మూవీని హిందీలో బేబి జాన్ పేరుతో.. వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా తీశారు. రీమేక్ అయినా రిజల్ట్ తేడా కొట్టేసింది. దానికి నందమూరి థమనే మ్యూజిక్ ఇచ్చాడు. అందులో బీస్ట్ మోడ్ అనే సాంగ్ ఉంది..థమన్ దాన్ని ఓజీ కోసం ఉన్నది ఉన్నట్టు వాడేశాడు..మళ్లీ దొరికేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక్కడ గమనించాల్సిందేంటంటే.. తన పాట తనే వాడుకున్నాడు.. పక్కనోడిది ఎత్తేస్తే కాపీ.. వేరే దాన్ని చూసి, నచ్చి, అలా చెయ్యాలని ప్రయత్నిస్తే అది స్పూర్తి.. ఓజీ సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ ముందు ఇలాంటివి కామనే అంటున్నారు పవన్ ఫ్యాన్స్.

