Dil Raju: వెంకటేష్, మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఈ సినిమా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్ గా రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో దుమ్ములేపింది. ఈ సినిమాతో దిల్ రాజు, శిరీష్ అదిరిపోయే లాభాలను అందుకున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాను రీమేక్ చేసే పనిలో ఉన్నారు దిల్ రాజు. ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసేందుకు దిల్ రాజు ప్రయత్నిస్తున్నారట. అయితే అనిల్ రావిపూడి మాత్రం డైరెక్టర్ కాదని తెలుస్తుంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నారు. అందుకే మరో డైరెక్టర్‌తో సంక్రాంతికి వస్తున్నాం మూవీని రీమేక్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట.
Also Read: Pawan Kalyan: పవన్ ఫొటోలు మార్ఫింగ్‌పై కేసులు!
ఈ రీమేక్ మూవీలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా నటించబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే అతను ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఒక్కసారి డైరెక్టర్ కన్ఫర్మ్ అవగానే, ఈ సినిమాను దిల్ రాజు అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.