Dil Raju: టాలీవుడ్‌లో ఒకప్పుడు దిల్ రాజు పేరు వినగానే ప్రేక్షకులకు హిట్ సినిమాల హామీ గుర్తొచ్చేది. ఆయన నిర్మించిన సినిమాలు బడ్జెట్‌లోనే నాణ్యమైన కంటెంట్‌తో స్టార్ హీరోలతో సక్సెస్‌ఫుల్‌గా నడిచేవి. 80 శాతం విజయాలతో దిల్ రాజు బ్రాండ్ ఓ సంచలనం. హీరోల అభిమానులు కూడా తమ ఫేవరెట్ స్టార్స్‌ను ఆయన బ్యానర్‌లో సినిమాలు చేయమని కోరేవారు. కానీ, ఇటీవలి కాలంలో దిల్ రాజు మ్యాజిక్ తగ్గింది. ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమవుతున్నాయి. విజయాల రేటు 20 శాతానికి పడిపోయింది.
Also Read: Vishnu Vishal: బ్లాక్ బస్టర్ సీక్వెల్స్ ని లైన్ లో పెట్టిన విష్ణు విశాల్!
కంటెంట్ నాణ్యత తగ్గడంతో పాటు బడ్జెట్‌లు పెరుగుతున్నాయి. ఇది ఆర్థికంగా, ఇమేజ్ పరంగా ఆయనకు పెద్ద దెబ్బ. ఇటీవల విడుదలైన ‘తమ్ముడు’ టాలీవుడ్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచి, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. ఇప్పుడు దిల్ రాజు ముందున్న ‘రౌడీ జనార్దన్’, ‘ఎల్లమ్మ’ సినిమాలపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలతో ఆయన ఎలాంటి కం బ్యాక్ ఇస్తారో చూడాలి.