Irfan Pathan: భారత్‌తో మ్యాచ్‌లో పాక్ ప్లేయర్లు రవూఫ్, ఫర్హాన్ రెచ్చగొట్టేలా సెలబ్రేషన్స్ చేసుకోవడంపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఫైరయ్యారు.ఒక టీవీ షోలో, తన యూట్యూబ్ ఛానెల్లో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘ఇరు దేశాల మధ్య పరిస్థితి తెలిసి కూడా ఇలా చేయడం అనవసరం. దీని ద్వారా వారిద్దరి క్యారెక్టర్, పెంపకం ఏంటో అర్థమవుతోంది. మరీ ఇంత దిగజారిపోవడం సరికాదు. వారి ప్రవర్తన నాకేమీ ఆశ్చర్యంగా అనిపించలేదు. ఇలాంటివి పాక్ ప్లేయర్లకు అలవాటే’ అని మండిపడ్డారు. ఫర్హాన్ బ్యాట్‌ను గన్లా పట్టుకుని షూట్ చేసినట్లు చేసిన సంజ్ఞపై పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి చర్యలు ఆట స్ఫూర్తికి విరుద్ధమని, అది వారి అహంకారాన్ని చూపిస్తుందని పేర్కొన్నారు. హారిస్ రౌఫ్ భారత బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ పట్ల దూకుడుగా ప్రవర్తించడాన్ని కూడా పఠాన్ తప్పుబట్టారు. బౌండరీలు కొట్టినప్పుడు రౌఫ్ చేసిన హావభావాలు, మాట్లాడిన మాటలు ఆమోదయోగ్యం కావని ఆయన అన్నారు. “మీరు మొదలుపెట్టిన దానికి మేము జవాబు ఇవ్వకుండా ఉండలేము.
ఇది కూడా చదవండి: Imran Khan: పాకిస్థాన్ క్రికెట్ పరువు తీసిన ఇమ్రాన్ ఖాన్
మేము బ్యాట్‌తోనే కాదు, మాటలతో కూడా బదులిస్తాము” అని పఠాన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. భారత ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిని పాటిస్తారని, అయితే రెచ్చగొడితే మాత్రం జవాబివ్వడానికి వెనుకాడరని స్పష్టం చేశారు. ఈ వివాదాస్పద సంఘటనలపై సాహిబ్జాదా ఫర్హాన్ స్పందిస్తూ, అది కేవలం తన సెలబ్రేషన్ స్టైల్ మాత్రమేనని, దూకుడుగా ఆడటమే తన లక్ష్యమని చెప్పడం గమనార్హం. అయితే, ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీ క్రికెటర్లు ఈ ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు, ఇలాంటి చర్యలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని అభిప్రాయపడ్డారు.