Iran: ఇరాన్-అమెరికా సంబంధాలు మళ్లీ ఉద్రిక్తతలను చవిచూస్తున్నాయి. అమెరికా విదేశాంగ విధానం మితిమీరిపోయిందని ఆరోపించిన ఇరాన్, తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఇరాన్ అగ్రనేత, మాజీ విదేశాంగ ఉపమంత్రి అబ్బాస్ అరఘ్చి కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా చర్యలు తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తున్నాయన్న ఆరోపణలతో, అబ్బాస్ అరఘ్చి స్పష్టం చేశారు. “అమెరికా తూట్లు పొడిచింది. తమ చర్యలకు తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఇరాన్ ప్రజలను, దేశ స్వాతంత్ర్యాన్ని రక్షించుకోవడానికి అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటాం.
అయితే ఇక్కడితో ఆగక, టెల్ అవీవ్‌పై ప్రతిదాడులకు సైతం సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. “అమెరికా శాశ్వత పరిణామాలను అనుభవించాల్సి ఉంటుంది. మేము తీవ్రమైన స్థాయిలో ప్రతిస్పందన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.”
ఇరాన్ చేసిన ఈ హెచ్చరికలు, ప్రస్తుత మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలను మరింత ముద్రిస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమెరికా నుంచి ఇప్పటి వరకు అధికారిక స్పందన రాలేదు. అయితే, రాబోయే రోజుల్లో ఇరాన్-అమెరికా సంబంధాల్లో మరింత పెరిగిన ఉద్రిక్తతలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.