AP IPS Transfers

AP IPS Transfers: ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు నియామకం

AP IPS Transfers: ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 14 జిల్లాలకు కొత్త జిల్లా ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఆదేశాల ప్రకారం కొంతమంది అధికారులు యథాతథంగా కొనసాగుతుండగా, కీలక జిల్లాలకు కొత్త ఎస్పీలు నియమితులయ్యారు.

కొత్తగా నియమితులైన ఎస్పీలు:

  • నెల్లూరు – అజితా వెజెండ్ల

  • విజయనగరం – ఎఆర్‌ దామోదర్

  • అన్నమయ్య – ధీరజ్ కునుగిలి

  • కృష్ణా – విద్యాసాగర్ నాయుడు

  • గుంటూరు – వకుల్ జిందాల్

  • కడప – నచికేత్

  • పల్నాడు – డి.కృష్ణారావు

  • తిరుపతి – సుబ్బారాయుడు

  • నంద్యాల – సునీల్ షెరాన్

  • బాపట్ల – ఉమామహేశ్వర్

  • ప్రకాశం – హర్షవర్థన్ రాజు

  • చిత్తూరు – తుషార్ డూడి

  • శ్రీసత్యసాయి – సతీశ్ కుమార్

  • బీఆర్ అంబేద్కర్ కోనసీమ – రాహుల్ మీనా

అదే విధంగా కొనసాగుతున్న జిల్లాలు:

  • శ్రీకాకుళం

  • పార్వతీపురం మన్యం

  • విశాఖపట్నం

  • అనకాపల్లి

  • అల్లూరి సీతారామరాజు

  • కాకినాడ

  • తూర్పు గోదావరి

  • పశ్చిమ గోదావరి

ఈ బదిలీలతో జిల్లాల పోలీస్ యంత్రాంగంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, తిరుపతి వంటి సున్నితమైన జిల్లాలకు కొత్త ఎస్పీలు రావడం విశేషం. కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్న అధికారులు చట్టం, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *