Revanth Reddy: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం. వివిధ సంస్థలతో వరుసగా సమావేశాలు నిర్వహించింది. ఇప్పటికే 10 సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దావోస్ వేదికగా ఎంవోయూ చేసుకున్నాయి. ఈ పది సంస్థల ద్వారా రాష్ట్రంలో రూ.1.32 లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నాయి. కొత్త ఒప్పందాలతో 46 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రాష్ట్రానికి పెట్టుబడులు మూడింతలు పెరిగాయి.
