Amravati: పరుగులు తియనున్న అమరావతి..ప్రపంచ బ్యాంక్ భారీ నిధులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు రూపాయిల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది. వచ్చే నెల చివరి నాటికి 3750 కోట్ల నిధులు విడుదల చేయనుంది.దీంతో గతంలో ఆగి పోయిన పనులు తిరిగి ప్రారంభమయ్యాయి.ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఎఎస్ ల కోసం నిర్మించిన అపార్టుమెంట్ల వద్ద మిగిలిపోయిన పనుల కోసం రూ.524 కోట్లకు పాలనానుమతి వచ్చింది. అమరావతిలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం జీ ప్లస్ 7గా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రూ.160 కోట్లతో అనుమతి వచ్చింది.సీఆర్డీఏ, ఏడీసీ, పురపాలక శాఖలోని అన్ని హెచ్ఓడీ కార్యాలయాలు ఈ భవనంలోనే వచ్చేలా నిర్మాణం చేపట్టనున్నారు.

రాజధాని పరిధిలో ఏడీసీ నిర్మించిన 360 కిలోమీటర్ల రహదారులు, డక్టుల నిర్మాణానికి సంబంధించి రీటెండరింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.కొండవీటి వాగు, పాలవాగు నుంచి వచ్చే వరద నీటిని గ్రావిటీ కెనాల్ లో వెళ్లేలా ప్రణాళిక చేస్తున్నారు అన్నారు. నెదర్లాండ్స్ నుంచి గ్రావిటీ కెనాల్ కు సంబంధించిన డిజైన్లు చేస్తున్నారు. అదనపు వరదనీటి కోసం ఆరు చోట్ల రిజర్వాయర్లను నిర్మించేలా ప్రణాళిక చేపటుతున్నారు. డిసెంబరులోపు అన్ని పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ మొదలుకానుంది. అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ భవనాలకు సంబధించిన టెండర్ల ప్రక్రియ పనులు 2025 జనవరి పూర్తి కానుంది.

ఏపీ సీఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీస్ పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూరూ.160 కోట్లతో నాడు 7 అంతస్తుల్లో కార్యాలయ పనులను చేపట్టిందని చెప్పారు. ఒకరు అమరావతిని స్మశానం అంటారు… ఇంకొకరు ఏడారి అంటారు… ఇంకొకరు మునిగిపొయింది అని ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు నిన్న వచ్చిన బెంగుళూరు వరదల్లో, ఆయన కట్టుకున్న యలహంకా ప్యాలెస్ మునిగిపోయిందని విమర్శించారు. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే. ఒకరు నాశనం అవ్వాలని కోరుకుంటే, మనమే నాశనం అవుతామని జగన్ గుర్తుపెట్టుకోవలని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *