Instagram: రెండుక్షరాల స్నేహం ఓ మనసును ఎంతదాకా అయినా తీసుకెళ్తుంది. అదే రెండక్షరాల మోసం కూడా మనిషిని పశువుగా మారుస్తుంది. ఇప్పుడు ఈ రెండు విషయాలు ఎందుకు చెప్తన్నానంటే స్నేహం కోసం నమ్మి దేశంకాని దేశానికి సముద్రాలు దాటొచ్చిన ఓ యువతి.. మోసం అనే వంచనకు గురై చివరకు వ్యభిచారిగా మారింది. చెన్నైలో మోసపోయి, హైదరాబాద్ వచ్చి వ్యభిచారం కూపంలో కూరుకుపోయిన ఆ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆమె అసలు విషయం బయటకొచ్చింది.
Instagram:థాయ్‌లాండ్‌కు చెందిన 30 ఏండ్ల యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఇండియా యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం పెరిగి పెద్దదైంది. ఇద్దరూ నిత్యం చాటింగ్ చేసుకుంటూ స్నేహ మాధుర్యాలు పంచుకునేవారు. దీంతో స్వచ్ఛమైన స్నేహంగా భావించింది ఆ యువతి. ఈ నేపథ్యంలో నమ్మి ఆ థాయ్‌లాండ్ యువతి తన స్నేహితుడి పిలుపుతో చెన్నైకి వచ్చేసింది.
Instagram:స్వచ్ఛమైన స్నేహం అనే భావనతో వచ్చిన ఆ యువతి కోసం ఆమె స్నేహితుడు ఓ హోటల్‌ను బుక్ చేశాడు. తన ఫ్రెండ్ తన కోసం ఎంత మర్యాద చేస్తున్నాడో అని అబ్బురపడింది. ఆ మర్యాద ముసుగులో అతను మోసం అనే కత్తి తీస్తాడని నమ్మలేకపోయింది. తన ఫ్రెండ్‌తో కలిసి ఇండియాలో పర్యటించి పలు విశేషాలను తెలుసుకోవచ్చు అని ఆ యువతి ముచ్చటపడింది.
Instagram:హోటల్‌లో ఉండగా ఆ థాయ్‌లాండ్ యువతిపై ఆ యువకుడు కన్నేశాడు. అసలు ఆమెను ఇక్కడికి రప్పించిందే తన కోరికను తీర్చుకోవడానికి అని ఆమె గ్రహించలేకపోయింది. ఇదే అదనుగా హోటల్ గదిలో ఉండగానే పలుమార్లు థాయ్‌లాండ్ యువతిపై ఆ దుండగుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. స్వచ్ఛమైన స్నేహం కోసం వచ్చిన తాను మోసం అనే కత్తికి బలవుతానని ఆమె అసలు ఊహించలేదు.
Instagram:ఈ దశలో కనీసం హోటల్ బిల్లు కూడా చెల్లించకుండా ఆ మెసగాడు వెళ్లిపోయాడు. ఆ బిల్లు చెల్లించాల్సిన బాధ్యత ఆమెపై పడింది. దేశం కాని దేశం, ఏం చేయాలో తెలియని స్థితి.. కనీసం ఇంటికి వెళ్లేందుకు కూడా డబ్బులు లేవు. ఆమెకు ఏదో రూపంలో ఓ విషయం తెలిసింది. థాయ్‌లాండ్ నుంచి వ్యభిచారం కోసం అమ్మాయిలను పంపే వారి ఫోన్ నంబర్ సంపాదించి, వారిని సంప్రదించింది.
Instagram:వారు ఆ యువతితో మరో యువతిని కలిపి హైదరాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలోని ఓ ప్లాట్‌లో వ్యభిచారం కోసం పంపారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి ఆ ఇద్దరు యువతనులను అదుపులోకి తీసుకున్నారు. స్నేహం కోసం ఇల్లు విడిచి వచ్చిన ఆ యువతి వ్యభిచారిగా మారి పోలీసులకు చిక్కింది.
Instagram:తనకు జరిగిన మోసం గురించి ఆ థాయ్‌లాండ్ యువతి పోలీసులకు తన గోడు వెళ్లబోసుకున్నది. తన స్నేహితుడి మోసం వల్ల టికెట్ చార్జీలకు డబ్బుల్లేక ఇలా తప్పనిసరి పరిస్థితిలో వ్యభిచార వృత్తిలోకి దిగానని చెప్పుకున్నది. అంతా విని అర్థం చేసుకున్న పోలీసులు ఆమెను పునరావాస కేంద్రానికి తరలించారు. చూశారా? ఓ యువతి స్నేహం ముసుగులో మోసపోయిన వైనం మరో యువతికి జరగొద్దని కోరుకుందాం. అమ్మాయిలు కూడా గుడ్డిగా ఇలాంటి స్నేహాన్ని నమ్మవద్దని హెచ్చరిద్దాం.