Crime News: మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అభం శుభం తెలియని 7 ఏళ్ల చిన్నారిని సొంత తల్లే మూడవ అంతస్తు నుండి కిందకు తోసివేసింది. తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి మరణించింది.
మల్కాజ్‌గిరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తల్లిదండ్రులు 20 ఏళ్లుగా స్థానిక వసంతపురి కాలనీలో నివాసం ఉంటున్నారు. తండ్రి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి గృహిణిగా తెలుస్తోంది. కొంతకాలంగా ఆమె మానసిక సమస్యలతో బాధ పడుతున్నట్టు సమాచారం.
ఇది కూడా చదవండి: Bhagyashree: భాగ్యశ్రీ బోర్సేకు మరో బంపర్ ఆఫర్?
సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తన ఏడేళ్ల కూతురిని అపార్ట్‌మెంట్ మూడవ అంతస్తుకు తీసుకుని వెళ్లి అక్కడ నుండి పాపను కిందకు నెట్టేసింది. పక్కనే ఉన్న బిల్డింగ్ మెట్లపైన పడిపోయింది. తీవ్ర గాయాలపాలైన చిన్నారిని చూసిన స్థానికులు వెంటనే గాంధీ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలో చిన్నారి మరణించింది.

