Misha Agrawal: సోషల్ మీడియా ప్లాట్ ఫారంల్లో తనదైన ముద్ర.. మూడు లక్షలకు పైగా ఫాలోవర్స్..లక్షాలది మంది హృదయాల్లో చోటు సంపాదించుకుంది ఎప్పుడో.. నిజ జీవితాన్ని చూపిస్తూనే కామెడీ వీడియోలు.. పైగా లా స్టూడెంట్.. కానీ సడన్ గా సూసైడ్ చేసుకుంది.. కానీ ఎందుకో తెలుసా..? ఇంస్టాగ్రామ్లో ఫాల్లోవెర్లు తక్కువ ఉన్నారని.. ఏంటీ మీరు నమ్మటం లేదా… కానీ ఇది జరిగింది మాత్రం నిజం.
ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్ ‘ది మిషా అగర్వాల్ షో’లో మూడు లక్షలకు పైగా ఫాలోవర్లతో ఆమె డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. మీషా కేవలం కంటెంట్ క్రియేటర్ మాత్రమే కాదు, లా చదువుతూ PCSJ కోసం సిద్ధమవుతోంది. ఆమె సృజనాత్మకత, తెలివితేటలు ఆమెను సోషల్ మీడియాలో యువతకు ప్రత్యేకంగా మార్చాయి.
Also Read: Crime News: ప్రాణం తీసిన లిక్కర్ పందెం..
సోషల్ మీడియా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నారు మీషా అగర్వాల్. కేవలం 24 సంవత్సరాల వయసులోనే లక్షలాది మంది హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ప్రయాగ్‌రాజ్ నివాసి అయిన మీషా, తన ప్రత్యేకమైన కామిక్ కంటెంట్, ఫన్నీ రీల్స్‌తో ఎక్కువ మంది ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్ ‘ది మిషా అగర్వాల్ షో’లో మూడు లక్షలకు పైగా ఫాలోవర్లతో ఆమె డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. మీషా కేవలం కంటెంట్ క్రియేటర్ మాత్రమే కాదు, లా చదువుతూ PCSJ కోసం సిద్ధమవుతోంది. ఆమె సృజనాత్మకత, తెలివితేటలు ఆమెను సోషల్ మీడియాలో యువతకు ప్రత్యేకంగా మార్చాయి.
మిషా వీడియోలలో ఒకవైపు కామెడీ, నిజ జీవిత కథలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మరోవైపు, ఆమె నిజమైన భావోద్వేగాలు కూడా ప్రతిబింబించేలా చేస్తారు. దీని కారణంగా అభిమానులు ఆమెతో ఎక్కువగా కనెక్ట్ అయ్యారని చెప్పాలి. కానీ, ఏప్రిల్ 26న మిషా ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. అది అందరినీ షాక్‌కు గురిచేసింది. అవును,.. తన 25వ పుట్టినరోజుకు కేవలం రెండు రోజుల ముందు అందరికీ సడెన్ షాక్ ఇస్తూ సూసైడ్ చేసుకుంది. కేవలం ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ తక్కువగా ఉన్నారనే కారణంగా మిషా బలవన్మరణానికి పాల్పడింది. 2025 ఏప్రిల్ 30న మిషా కుటుంబం ఆమె ఆత్మహత్యకు గల కారణాన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.

