Viral Video:

Viral Video: మార్చి 21న భారత్-పాక్ యుద్ధం? సోషల్ మీడియా జోస్యంపై నెటిజన్ల ఫైర్!

Viral Video: సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ప్రెసెంట్ వైరల్ టాపిక్ లేదా ట్రెండింగ్ న్యూస్ గురించి వీడియోస్ చేయడం కంటెంట్ క్రియేటర్స్ కి అలవాటే. కానీ ఈమె మాత్రం ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం తర్వాత ఇండియా-పాకిస్థాన్ యుద్ధం జరగనున్నట్టు చెప్పింది. ఆఖరికి మార్చి 21 అనే డేట్ కూడా పక్కాగా చెబుతోంది. అందరూ యుద్ధం కోసం సిద్ధం కావాలని, అందుకు తగినన్ని డబ్బులు, మెడిసిన్స్, పవర్ బ్యాంక్స్, ఇంకా 1 లేదా 2 నెలలకి సరిపడా ఆహారాన్ని సిద్ధం చేసుకొని ఉండాలని సూచించింది. అసలు ఈమె ఏం చెబుతుందో చూద్దాం.

ఇరాన్ యుద్ధం తర్వాత భారత్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ రెండు దేశాలు పాకిస్థాన్‌ని చుట్టుముట్టి యుద్ధం చేసి, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌ని మళ్లీ ఇండియాలో కలిపేసుకుంటుంది అంటోంది. అసలు ఆమె ఇలా చెప్పడానికి గల కారణాలు తెలుసుకుందాం.

మోదీ ఇంకా భారత్ జాతకం ప్రకారం మార్చి 21న రిక్త తిథి ఉంటుందని, ఆరోజు నైట్ 12 గంటలకు 4వ గదిలో బుధుడు, రాహువు, కుజుడు కలిసి అంగారక యోగం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో భారతదేశపు సరిహద్దులు మారిపోతాయి, పాక్ ఆక్రమించిన కాశ్మీర్ కూడా భారత్‌లో కలిసిపోతుంది. ఇలా జరగడానికి ఆఫ్ఘనిస్తాన్ కూడా సహాయం చేస్తుంది అంటే.. భారత్‌కి సపోర్ట్ ఇస్తుందని చెప్పడం కాదు, మనం యుద్ధం చేసే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ కూడా యుద్ధం చేస్తది. పాకిస్థాన్ రెండు దేశాలతో ఒకేసారి యుద్ధం చేయలేక ఓడిపోతుందని ఆమె అంటోంది.

బయట యుద్ధం జరుగుతూ చిన్న పిల్లల నుండి పెద్దల వరకు మరణిస్తుంటే, ఈమె సోషల్ మీడియాలో రీచ్ ఇంకా వ్యూస్ కోసం ఇలాంటి వీడియోస్ చేస్తోంది అంటూ నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. యుద్ధం వస్తుంది అంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదు అని ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *