Indiramma scheme: ఉపాధి హామీ కూలీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద అర్హులైన వారికి నిధులను విడుదల చేసింది. ఎన్నికల కోడ్ అమలులో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను జమ చేసింది.
Indiramma scheme: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని జనవరి 26న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తొలుత ప్రతి మండలంలో ఒక పైలెట్ గ్రామంగా ఎంచుకొని గ్రామసభలు నిర్వహించి కూలీల ఖాతాల్లో నిధులు జమచేసింది. ఆనాడు 18,180 మంది ఉపాధి కూలీల ఖాతాల్లో రూ.6 వేల చొప్పున నగదును వేసింది.
Indiramma scheme: ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిలిచిపోయింది. అయితే ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాలకు నిధుల విడుదలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు అనుమతి లభించింది. దీంతో మళ్లీ ఈ పథకాన్ని ఎన్నికల కోడ్ అమలులోలేని జిల్లాల ఉపాధి కూలీలకు నిధులు విడుదలను ప్రారంభించింది.
Indiramma scheme: ఈ మేరకు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లోని 66,240 మంది ఉపాధి కూలీలైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను ప్రభుత్వం చెల్లించింది. ఈ మేరకు వారందరి ఖాతాల్లో రూ.39.74 కోట్లను జమ చేసింది. ఇప్పటి వరకు మొత్తంగా 83,420 మంది ఉపాధి కూలీలకు రూ.50.65 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.
Indiramma scheme: ఎన్నికల కోడ్ ముగియగానే లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను ప్రభుత్వం చెల్లించనున్నది. ఒక్కో సీజన్లో రూ.6,000 చొప్పున నగదును ప్రభుత్వం జమ చేస్తుంది. డీబీటీ పద్ధతిలో ఉపాధి కూలీల ఖాతాల్లోకి నేరుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను సర్కారు జమ చేస్తున్నది.