Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇక నుంచి ఆధార్ ఆధారిత చెల్లింపులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకు ఖాతాల, వాటి ఐఎఫ్ఎస్సీ నంబర్లలో పొరపాట్లు జరుగుతున్నాయి. దీనివల్ల చాలా మంది ఖాతాల్లో డబ్బులు జమం కావడం లేదు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి.
Indiramma Indlu: ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నగదు పంపిణీని ఆధార్ ఆధారంగానే చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు తొలుత 9,100 మందికి ఆధార్ ఆధారితంగా నగదు చెల్లింపులు సక్రమంగా జమయ్యాయని తెలిసింది. ఎక్కడా పొరపాట్లు చోటు చేసుకోలేదని సిబ్బంది తెలిపారు. ఇదే సమయంలో చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయనున్నట్టు అధికారులు కూడా తెలిపారు.
Indiramma Indlu: ఆధార్ ఆధారిత చెల్లింపులు ఇటు లబ్ధిదారులకే కాకుండా, ప్రభుత్వానికి మేలు జరుగుతుందని చెప్తున్నారు. ఈ విధానం ద్వారా నిధుల దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని, మధ్యవర్తుల జోక్యం కూడా ఉండబోదని స్పష్టమవుతున్నది. ఈ విధానం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించినట్టవుతుందని అధికారులు తేల్చి చెప్తున్నారు.
Indiramma Indlu: ఇదే విధానాన్ని బలోపేతం చేయడం కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల్లో కూడా ఈ మేరకు సాంకేతిక సౌకర్యాలను కల్పిస్తున్నది. లబ్ధిదారుల ఆధార్ వివరాలను సేకరించి, బ్యాంకు ఖాతాలతో జమ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. వచ్చే రోజుల్లో పూర్తిస్థాయిలో ఇదే విధానం అమలు అవుతుందని తెలిపారు.

