Indiramma Canteens: గతంలో అన్నపూర్ణ క్వాంటీన్లుగా రూ.5కే భోజనం అందించిన కేంద్రాలను ఇందిరమ్మ క్వాంటీన్లుగా రూపుదాల్చిన రాష్ట్ర సర్కారు.. వాటిని పూర్తిగా మార్పులు, చేర్పులు చేస్తున్నది. కొత్త మెనూ రూపొందించింది. కేంద్రాల రూపును మార్పు చేయనుంది. ఈ మేరకు ఏర్పాట్లలో అధికారులు, సిబ్బంది ఉండగా, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ క్వాంటీన్లను ప్రారంభించనున్నారు.
Indiramma Canteens: ఇందిరమ్మ కేంద్రాలలో గతంలో కేవలం మధ్యాహ్నం వేళ భోజనం మాత్రమే రూ.5కు లభించేది. కానీ, ఈ సారి అల్పాహారం కూడా వడ్డించాలని సర్కారు సిద్ధం చేస్తున్నది. క్వాంటీన్ల నమూనాను జీహెచ్ఎంసీ మారుస్తున్నది. 40:10, 20:10 పరిమాణంతో నూతన కేంద్రాలను డిజైన్ చేసింది. వడ్డనకు అనువుగా ఉండాలనే ఉద్దేశంతో విస్తీర్ణాన్ని పెంచుతున్నది.
Indiramma Canteens: ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లో ఇప్పటికే ఇందిరమ్మ క్వాంటీన్ నూతన నమూనా ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద పనులు తుది దశకు చేరుకున్నాయి. కొత్త నమూనాలో జీహెచ్ఎంసీ లోగో, దివంగత ప్రధాని ఇందిరాగాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటోలు ఉండనున్నాయి. భోజనం, అల్పాహారం ఫొటోలూ ఉండనున్నాయి.
Indiramma Canteens: ప్రస్తుతం 128 కేంద్రాలు ఉండగా, వాటిని 150 కేంద్రాలకు పెంచనున్నారు. డివిజన్‌కు ఒకటి చొప్పున ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పేదలకు అల్ఫాహరంగా తృణ ధాన్యాలతో చేసిన ఇడ్లీ, ఉప్మా, పొంగల్, పూరి వంటివి వడ్డించనున్నారు. వారంలో ఆదివారం మినహా ఆరు రోజులు అల్పాహారం అందుబాటులో ఉంటుంది. ఒక్కో టిఫిన్‌కు రూ.19 ఖర్చు అవుతుండగా, లబ్ధిదారులు రూ.5 చెల్లించాల్సి ఉండగా, మిగతా రూ.14 హరేకృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్‌కు జీహెచ్ఎంసీ చెల్లించనున్నది.
Indiramma Canteens: అల్పాహారంలో వారంలో తొలిరోజైన సోమవారం మిల్లెట్ ఇడ్లీ 3, సాంబార్, పొడి ఇస్తారు. రెండోరోజు మిల్లెట్ ఉప్మా, సాంబారు, చెట్నీ, మూడో రోజు పొంగల్, సాంబార్, మిక్చర్, నాలుగో రోజు ఇడ్లీ, సాంబర్, చట్నీ, ఐదో రోజు పొంగల్, సాంబార్, మిక్చర్, ఆరో రోజు పూరి, ఆలు కూర్మా ఇస్తారు. ఒక్కోటి ఇచ్చే తూకం వారీగా కూడా పట్టికలో ఇస్తారు.