Indigo:ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానం.. సుమారు 4,000 అడుగుల ఎత్తులో ప్రయాణం.. ఒక్కసారిగా కుదుపు.. ఏమిటా అని పరిశీలించగా.. ఏదో ఢీకొన్నట్టు ఆనవాళ్లు.. విమానంలో 175 మంది ప్రయాణికులు.. పైలెట్‌కు ఒక్కసారిగా అయోమయం ఏర్పడింది.. ఆ పైలెట్ చాకచక్యంతో ఆ 175 మంది సురక్షితంగా ఉన్నారు. ఏం జరిగిందో తెలుసుకుందాం రండి.
Indigo:బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా నుంచి రాంచీ వెళ్తున్న ఇండిగో విమానాన్ని ఆకాశంలో 4,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా, ఒక రాబందు అకస్మాత్తుగా ఢీకొన్నది. టేకాఫ్ అయిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది. దీన్ని గుర్తించిన పైలెట్ ఎయిర్‌లైన్స్ సిబ్బందికి సమాచారం చేరవేశాడు. దీంతో సమీపంలో ఉన్న రాంచీ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండింగ్ చేశాడు.
Indigo:ప్రయాణికులతో సహా సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో విమానం ముందు భాగం కాస్త దెబ్బతిన్నట్టు సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై ఎయిర్‌లైన్స్ సిబ్బంది మాత్రం స్పందించలేదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నట్టు సిబ్బంది తెలిపారు. ఆయా సందర్భాంల్లో పక్షులు ఢీకొని సాంకేతిక లోపాలు తలెత్తిన సందర్భాలు లేకపోలేదు.

