Indigo: ఢిల్లీ విమానాన్ని హైజాక్ చేస్తాం..

Indigo: కువైట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చినట్లు సమాచారం. విమానాన్ని హైజాక్ చేస్తామని దుండగులు హెచ్చరించడంతో విమాన సిబ్బంది అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల వల్ల ఆ విమానాన్ని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేయించారు.

ల్యాండింగ్ అనంతరం భద్రతా సిబ్బంది విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. బాంబు బెదిరింపు నిజమా లేదా అబద్ధమా అనే విషయంపై అధికారులు విచారణ చేపట్టారు.

ఇలాంటి బెదిరింపులు విమానయాన భద్రతకు పెద్ద ప్రమాదమని అధికారులు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *