IndiGo Flight: మరో ఇండిగో విమానంలో సమస్య ఏర్పడింది. ఇటీవల అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన అనంతరం.. విమానాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా, పెద్ద సమస్య ఏర్పడినా ముందస్తు జాగ్రత్తలకే సిబ్బంది ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికి పలు విమానాలు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాయి. తాజాగా ఓ ఇండిగో విమానానికీ ఇలాంటి ఓ ప్రమాదమే ముంచుకొచ్చింది.
IndiGo Flight: ఢిల్లీ నగరం నుంచి గోవా వెళ్తున్న ఇండిగో విమానం ఆకాశంలో ఉండగానే ఇంజిన్ ఫెయిల్ అయింది. ఈ విషయాన్ని పసిగట్టిన పైలట్ ప్యాన్ ప్యాన్ ప్యాన్ అంటూ సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత ముంబై ఎయిర్ పోర్టులో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్టయింది. పైలట్ నిర్ణయంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
IndiGo Flight: ప్యాన్ ప్యాన్ ప్యాన్ అంటే విమాన పైలెట్ ఇచ్చే మరో సంకేతం అన్నమాట. మేడే కంటే తక్కువ తీవ్రమైన అత్యవసర పరిస్థితిని సూచిస్తుంది. ఏదైనా సమస్య ఉన్నది, కానీ ప్రాణాలకు హాని కలిగించేంత ప్రమాదం లేదు, విమానం అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి ఉన్నది.. అని విమానంలో సాంకేతిక సమస్య వచ్చినప్పుడు పైలెట్లు ఇచ్చే సంకేతమే ఇది.