IndiGo Flight: అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన తర్వాత ఆకతాయిలు, అరాచకవాదులు కూడా తమ పనికానిచ్చేస్తున్నారు. ఇప్పటికే విమాన ప్రయాణమంటే హడలెత్తిపోతుండగా, తమ ఆకతాయి చేష్టలతో, అరాచకత్వంతో మరింతగా భయపెట్టేందుకు సిద్ధపడుతున్నారు. ఇలాంటి వాటికి గతంలో తేలికగా తీసుకున్న సిబ్బంది.. ఈ సారి చిన్నపాటి అనుమానం వచ్చినా తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు.
IndiGo Flight: తాజాగా ఇండిగో విమానానానికి వచ్చిన బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. కొచ్చిన్-ఢిల్లీ నగరాల మధ్య ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి ఈ బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో విమానాన్ని నాగపూర్ సిటీ మళ్లించారు. నాగపూర్ చేరుకున్నాక అక్కడి భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇది ఆకతాయిల పనా, లేక తీవ్రవాదులు ఎవరైనా బాంబు పెట్టారా? అన్న కోణంలో భద్రతా సిబ్బంది విచారిస్తున్నారు.