Dolo 650 Overuse

Dolo 650 Overuse: డోలో 650ని జెమ్స్‌లా తినేస్తున్నారు.. డాక్టర్ షాకింగ్ పోస్ట్..

Dolo 650 Overuse: ఒకప్పుడు “డోలో 650” పేరు వినగానే చాలామందికి తెలియకపోయినా, ఇప్పుడు ప్రతి ఇంట్లోని మెడిసిన్ బాక్స్‌లో తప్పనిసరిగా ఉంటుంది. జ్వరం వచ్చిందా? ఒళ్లునొప్పులా? తలనొప్పా? ఏదైనా చిన్న సమస్యకైనా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా నేరుగా మెడికల్ షాపుకే వెళ్లి “డోలో 650 ఇవ్వండి” అంటున్నారు.
అది కూడా ఒక్కటి కాదు — రెండు, మూడు, నాలుగు ప్యాకెట్లు. ఇంకేమైనా క్యాడ్‌బరీ జెమ్స్‌లా తినేస్తున్నారా?

డాక్టర్‌కి లేకుండా ఔషధం..?

వైద్యుల సూచన లేకుండా మందులు వాడకూడదనే సూత్రాన్ని చాలా మంది పూర్తిగా మర్చిపోయారు. సెల్ఫ్ మెడికేషన్ అంటే తనకు తానే డాక్టర్ అవడమే. ఇది చిన్న విషయంగా అనిపించినా దీని వల్ల వచ్చే పరిణామాలు మాత్రం చాలా పెద్దవిగా ఉంటాయి. డోలో 650లో ఉండే పారాసెటమాల్ అధిక మోతాదులో తీసుకుంటే కాలేయానికి (లివర్‌కు) తీవ్ర నష్టం కలగొచ్చు. ఇది కిడ్నీ ఫెయిల్యూర్‌కి కూడా దారి తీసే ప్రమాదం ఉంది.

ఒక్కసారి కాదు.. తరచూ!

మొదట్లో కేవలం జ్వరం వచ్చినపుడు మాత్రమే వాడితే, ఇప్పుడు ప్రతి చిన్న టింగ్ వచ్చినా “డోలో వేసుకోమంటూ” మనుషులు సలహాలు ఇచ్చేస్తున్నారు. డాక్టర్లు మాత్రం హెచ్చరిస్తున్నారు..ఇలా బాగా తెలిసి వేసుకునే ఔషధం కాదు ఇది, మోతాదుకు మించి వాడితే మంచిదికాదు అంటున్నారు.

ఇది కూడా చదవండి: BJP MP: ‘‘సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే పార్లమెంట్ మూసేయాలి’’.. వక్ఫ్ చట్టంపై బీజేపీ ఎంపీ..

కోవిడ్ మారిన తర్వాతి మాటే వేరైపోయింది

2020 తర్వాత ఇండియాలో డోలో 650 వినియోగం ఏ స్థాయికి వెళ్లిందో అంకెలు చెబుతున్నాయి. మైక్రో ల్యాబ్స్ కంపెనీ ఆ సంవత్సరం 350 కోట్లకుపైగా మాత్రలు విక్రయించి, రూ. 400 కోట్ల టర్నోవర్ సాధించింది. దీన్ని ఫోర్బ్స్ రిపోర్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. మహమ్మారి ముందు 7.5 కోట్ల స్ట్రిప్స్ మాత్రమే అమ్మిన ఈ కంపెనీ, 2021 చివరికి 14.5 కోట్ల స్ట్రిప్స్ విక్రయించింది! అంటే దాదాపు రెట్టింపు.

వైరల్ కామెంట్: జెమ్స్ లా తినేస్తున్నారు!

ఈ వినియోగ ధోరణిపై గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పళనియప్పన్ మాణిక్యం చేసిన కామెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. “భారతీయులు డోలో 650 ని క్యాడ్‌బరీ జెమ్స్‌లా తినేస్తున్నారు” అని ఆయన ఎక్స్‌లో (ట్విట్టర్) చేసిన పోస్ట్ తెగ వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు తమ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి అంటున్నారు.

అవగాహన అవసరం

డోలో 650, డాక్టర్ చెప్పినప్పుడు మాత్రమే వాడాలి. లేదంటే ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాలు పడతాయి. చిన్న జ్వరం కోసం మనం వేసుకునే ఓ మాత్ర, మన ఆరోగ్యానికి పెద్ద సమస్య తీసుకురావచ్చు. అందుకే మందులకు “మంది మాట” అవసరం. అదే డాక్టర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *