Virat Kohli Injury: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మోకాలి గాయంతో ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డే కు దూరం అయిన విషయం తెలిసిందే. ఇక ఆసీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచిన కోహ్లీ… తనకు ఎంతో ప్రీతిపాత్రమైన వన్డేలలో రాణించి మళ్లీ ఫామ్ దొరకబుచ్చుకుంటాడని ఆశించిన ఫ్యాన్స్ అందరూ నిరాశ చెందారు. పైగా ఛాంపియన్స్ ట్రోఫీకి రెండు వారాలు కూడా లేని నేపథ్యంలో కోహ్లీ ఫిట్నెస్ విషయమై ఆందోళన నెలకొంది.
ఇంగ్లాండ్ తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో భారత్ మొదటి మ్యాచ్ లోనే ఘనవిజయం సాధించింది. ఇక 87 పరుగులతో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన టాప్ ఆర్డర్ బ్యాటర్ శుభమన్ గిల్… కోహ్లీ గాయం విషయంపై అభిమానులకు ఊరతని ఇచ్చే విధంగా ఒక అప్డేట్ ఇచ్చాడు. కోహ్లీ మోకాలు వాచినందు వల్ల అతను మొదటి వన్డే కు తుది జట్టు నుండి దూరంగా ఉన్నాడు.
అయితే గిల్ మాత్రం కోహ్లీ గాయంపై పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్టత ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. నిన్న ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత కోహ్లీ మోకాలు మరికొద్దిగా వచ్చింది. కాబట్టి ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా అతనిని మొదటి వన్డే నుండి పక్కన పెట్టినట్టు చెప్పాడు. ఇక కోహ్లీ ఆడే మూడవ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన గిల్… అతని తరహాలోనే లక్ష్య ఛేదన మొత్తం నింపాదిగా కాచుకొని అవసరమైనప్పుడు బౌండరీలు కొడుతూ జట్టుని విజయ తీరాలు చేర్చాడు.
Virat Kohli Injury: ఇక కోహ్లీ విషయానికి వస్తే ఎప్పుడూ ఫిట్నెస్ విషయంలో వెనుక్కు తగ్గని విరాట్… మోకాలు కొద్దిగానే వాచింది. అంతేకాకుండా గిల్ చెప్పిన దాని ప్రకారం కోహ్లీ రెండవ వన్డే కు అందుబాటులో ఉంటాడు. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా ను గాయం కారణంగా దాదాపు చాంపియన్స్ ట్రోఫీకి దూరం చేసుకున్న భారత జట్టు కోహ్లీని కూడా కోల్పోతే టైటిల్ గెలిచే అవకాశాలు సన్నగిల్లుతాయి. అందుకు తోడు రోహిత్ కూడా ఫామ్ లో లేడు.
ఇది కూడా చదవండి: Horrible Cruelty: అయ్యో ఎంత ఘోరం.. వందలాది మహిళలపై అత్యాచారం.. సజీవదహనం!
ఇక కోహ్లీ గాయం గురించి మరింత లోతుగా వెళితే… టీపిండియా ప్లేయర్లు మ్యాచ్ కు ముందు ఫుట్ బాల్ ఆటను ప్రాక్టీస్ చేయడం లేదా సరదాగా ఆడడం ఆపాలని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాడు. ముఖ్యంగా ఫుట్ బాల్ ఆడే సమయంలోనే మోకాళ్ళపై ఎక్కువ ఒత్తిడి పడి ఇలాంటి వాపులు వస్తుంటాయి. ధోని, కోహ్లీ ఫుట్ బాల్ ను ఎక్కువగా ప్రాక్టీస్ సమయంలో ఆడుతుంటారు. గతంలో కూడా ధోని వయసు పైబడుతున్న సమయంలో ఇలాంటి మోకాలు గాయాన్ని ఎదుర్కొన్నాడు. మరి కోహ్లీ వీలైనంత త్వరగా కోలుకొని జట్టులో చేరి కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫామ్ అందుకోగలిగితే అది భారత జట్టుకే ఎంతో ఆత్మవిశ్వాసం ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

