Ramayana

Ramayana: హాలీవుడ్ ఆశ్చర్యపోయేలా భారత రామాయణ సంచలనం!

Ramayana: నితీష్ తివారీ డైరెక్షన్లో వస్తున్న రామాయణ సినిమా భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని రాయనుంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ రెండు భాగాల కోసం రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు సమాచారం. ఈ బడ్జెట్ భారతీయ సినిమా రంగంలో ఇప్పటివరకు ఊహించని స్థాయిలో ఉంది. హాలీవుడ్ సైతం ఆశ్చర్య పోతుంది.

Also Read: Kingdom: విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ నుంచి హార్ట్ టచింగ్ అప్డేట్!

అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్లు, అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్ల సహకారంతో ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన అనుభవాన్ని అందించనుంది. మొదటి భాగం 2026 దీపావళికి విడుదల కానుంది, రెండో భాగం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ భారీ బడ్జెట్ వివరాలు సినీ ప్రియులను ఆశ్చర్యంలో ముంచెత్తాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *