Indian railway: భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ కు సరిపడా భోగి లేకపోవడంతో ఇన్ని రోజులు ఇరుగ్గా నిలబడి ప్రయాణించిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే వాటికి పలికేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణం సాఫీగా సాగేందుకు రైళ్లు కొత్త బోగీలు ఏర్పాటుపై రైల్వే శాఖ దృష్టిసారించింది. ఇందులో భాగంగా 370 రైళ్లకు 1000 కొత్త జనరల్ బోగీలను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రక్రియ ఈ నెలాఖరు నాటికి పూర్తవుతుందని రైల్వే బోర్డు ప్రకటించింది.
ఈ బోగీల అనుసంధానం ద్వారా రోజూ లక్ష మంది ప్రయాణించవచ్చని పేర్కొంది. గత మూడు నెలలుగా 600 జనరల్ కోచ్‌లను వివిధ రెగ్యులర్ రైళ్లకు అమర్చామని, మిగతా వాటి ప్రక్రియ కొనసాగుతోందని వివరించింది.370 రైళ్లలో 1,000కిపైగా కొత్త జనరల్ బోగీలను అమర్చబోతున్నట్టు రైల్వే బోర్డ్ ప్రకటించింది. పలు రైళ్లలో ఇప్పటికే 583 జనరల్ కోచ్‌లను అమర్చగా, ఈ నెలఖరు నాటికి మిగిలిన రైళ్లకు అమర్చే ప్రక్రియ పూర్తవుతుందని తెలిపింది.
దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్‌లు, డివిజన్లలో ఈ కోచ్‌ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని.. నవంబర్ నెలాఖరు నాటికి ఇది పూర్తవుతుందని రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ వెల్లడించారు. వచ్చే ఏడాది హోలీ పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని తాము సన్నాహాలు ప్రారంభించామని ఆయన తెలిపారు. అలాగే, రాబోయే రెండేళ్లలో 10,000 నాన్-ఏసీ కోచ్‌లను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నామని ఆయన చెప్పారు. దీని ద్వారా 8 లక్షల మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుందని రైల్వే బోర్డు తెలిపింది.