IOA Approves Bid: ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) తన స్పెషల్ జనరల్ మీటింగ్‌లో 2030 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించడానికి భారత్ బిడ్‌కు అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ బిడ్‌లో అహ్మదాబాద్ను ఆతిథ్య నగరంగా ప్రతిపాదించారు. తుది బిడ్ ప్రతిపాదనలను ఆగస్టు 31 లోపు సమర్పించాలి.అహ్మదాబాద్ నగరాన్ని ప్రధాన ఆతిథ్య నగరంగా ఎంపిక చేశారు. అయితే, అవసరమైన మౌలిక సదుపాయాలు లేని క్రీడాంశాలకు భువనేశ్వర్, ఢిల్లీ వంటి నగరాలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. కెనడా బిడ్ ప్రక్రియ నుండి వైదొలగడంతో భారతదేశానికి 2030 క్రీడలను నిర్వహించే అవకాశాలు మెరుగయ్యాయి.
Also Read: Arjun Tendulkar: సైలెంట్ గా సచిన్ కొడుకు నిశ్చితార్థం ..అమ్మాయి ఎవరంటే?
2026 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్ వంటి కొన్ని ముఖ్యమైన క్రీడాంశాలను తొలగించారు. కానీ, 2030 క్రీడలు పూర్తి స్థాయి క్రీడలుగా ఉంటాయని, భారతదేశానికి ఎక్కువ పతకాలు వచ్చే క్రీడాంశాలను చేర్చాలని IOA భావిస్తోంది. 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య దేశాన్ని నవంబర్ చివరి వారంలో గ్లాస్గోలో జరిగే కామన్వెల్త్ స్పోర్ట్ జనరల్ అసెంబ్లీలో ప్రకటిస్తారు. భారత్ గతంలో 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలను నిర్వహించింది. ఈ బిడ్‌ను 2036లో జరిగే ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలనే భారతదేశ ఆశయాలకు ఒక అడుగుగా చూస్తున్నారు. దీనిపై ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష మాట్లాడుతూ.. ‘‘మేమందరం కలిసి ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. మా సన్నాహాలు కొనసాగుతాయి. అహ్మదాబాద్‌ను మాత్రమే ఆతిథ్య నగరంగా భావించట్లేదు. భువనేశ్వర్, దిల్లీల్లోనూ మెరుగైన సౌకర్యాలున్నాయి. క్రీడలు ఎక్కడ జరుగుతాయో త్వరలో వెల్లడిస్తాం. 2026 కామన్వెల్త్ గేమ్ పరిధి తగ్గించారు. కానీ 2030లో మేం 2010లో మాదిరిగానే పూర్తి స్థాయిలో నిర్వహించాలనుకుంటున్నాం’’ అని ఉష పేర్కొంది.