Indian Government: భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ఇద్దరు దిగ్గజ నటులు, సూపర్ స్టార్ రజనీకాంత్, నందమూరి బాలకృష్ణ మరో అరుదైన గౌరవాన్ని అందుకోబోతున్నారు. తమ సినీ ప్రస్థానంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, భారత ప్రభుత్వం వీరిద్దరినీ ఘనంగా సన్మానించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ ప్రత్యేక సత్కారం 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2025 ముగింపు వేడుకలో జరగనుంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ వేడుకలు గోవా వేదికగా ఈ నెల 20 నుంచి 28 వరకు జరగనున్నాయి.
Also Read: Trisha: పెళ్లిపై త్రిష ఆవేదన?
మైలురాయిగా కేంద్ర ప్రభుత్వ ప్రకటన
ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ అధికారికంగా వెల్లడించారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, “తమ సినీ ప్రయాణంలో 50 ఏళ్లు పూర్తి చేసుకుని, సినీ కళామతల్లికి విశేష సేవలు అందించిన రజనీకాంత్, బాలకృష్ణలను ఘనంగా సన్మానించనున్నాం. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇది ఒక మైలురాయి. వారి అద్భుత నటన, ప్రజాదరణతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించారు. వారి కృషికి గుర్తింపుగా IFFI ముగింపు వేడుకల్లో వారిని సన్మానిస్తాం” అని తెలిపారు.
రజనీకాంత్ 1975లో ‘అపూర్వ రాగంగళ్’ చిత్రంతో నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి, తనదైన స్టైల్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. బాలకృష్ణ కూడా నటుడిగా రాణిస్తూనే సామాజిక సేవలో తనదైన ముద్ర వేశారు.
ప్రస్తుతం సినిమాలతో బిజీ
రజనీకాంత్, బాలకృష్ణ ఇద్దరూ ప్రస్తుతం తమ సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ‘అఖండ’ కు సీక్వెల్‌గా 3D ఫార్మాట్లోనూ విడుదల కానుంది.
రజనీకాంత్ ప్రస్తుతం ‘జైలర్ 2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. దీని తర్వాత కమల్ హాసన్ నిర్మాణంలో ఓ సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రేజీ కాంబో 46 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి పనిచేయనుండటం విశేషం.
