ChatGPT and AI Tools Ban: ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఉద్యోగులు ChatGPT – Deepseek వంటి AI సాధనాలను ఉపయోగించకుండా నిషేధించింది. మంత్రిత్వ శాఖ అందించే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు వంటి కార్యాలయ పరికరాల్లో ఉద్యోగులు AI సాధనాలను ఇన్ స్టాల్ చేయకుండా చర్యలు తీసుకున్నారు. ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలు AI సాధనాలను నిషేధించాయి. డీప్‌సీక్ వాడకాన్ని అమెరికా సెనేట్‌లో నిషేధించారు.
ఇది కూడా చదవండి: Musical Night: ఈ నెల 15 న తలసేమియా భాదితులకు సహయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్
AI సాధనాలను ఉపయోగించడం వల్ల గోప్య సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ, ChatGPT మాతృ సంస్థ Open AI లేదా DeepSeek నుండి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదు. ఓపెన్ AI CEO సామ్ ఆల్ట్మాన్ భారతదేశ పర్యటనలో ఉన్న సమయంలో ఈ నిషేధం గురించిన వార్తలు వచ్చాయి. ఆయన నిన్న ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు.
