UP:అబ్బాయిది భారత్.. అమ్మాయిది పాకిస్థాన్ దేశం. వివాహం నిశ్చయం జరిగింది.. వివాహ గడియలు దగ్గర పడటంతో పరిస్థితులు అనుకూలించలేదు. చేసేది లేక పెళ్లికి నిశ్చయించిన గడియలోనే తంతు జరిపించేశారు పెద్దలు. మరి జరిగింది ఎలా అనుకుంటున్నారు. అంతా ఆన్‌లైన్‌లోనే. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాకు చెందిన బీజేపీ నేత, స్థానిక కౌన్సిలర్ అయిన తహసీన్ షాహిద్ తన కొడుకు మహ్మద్ అబ్బాస్ హైదర్‌కు పాకిస్థాన్ సంబంధం చూశారు. అక్కడి లాహోర్‌కు చెందిన యువతి అందాలిప్ జహ్రాతో వివాహం జరిపించాలని పెద్దల సమక్షంలో నిశ్చయించారు.
UP:అబ్బాస్ హైదర్, అందాలిప్ జహ్రా జంటకు శుక్రవారం జరిగే పెళ్లికి అందరూ ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక్కడే చిక్కొచ్చిపడింది. ఇరు కుటుంబాలు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. పెళ్లి జరిగే నాటికి ఆ వీసాలు ఇరు కుటుంబాలకు అందలేదు. దానికితోడు వధువు తల్లి యాస్మిన్ జైదీ తీవ్ర అనారోగ్యంతో ఉండగా అక్కడి దవాఖానకు తరలించారు. ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స జరిపిస్తున్నారు.
UP:మరి ఇరు కుటుంబాల్లో పెళ్లికి ఏర్పాట్లు జరిగాయి. అనుకున్న గడియల్లోనే పెళ్లి జరగాలని అటు నుంచి ఇటు నుంచి పెద్దలు సూచించారు. దీంతో వారిలో ఒకరికి వచ్చిన ఐడియాను ఇట్టే అమలు చేసేశారు. ఈ లోగా ఏర్పాట్లు చేసేశారు. బంధుమిత్రులను పిలుచుకున్నారు. ఆన్‌లైన్ వేదిక ఏర్పాటు చేశారు. దానికి ఏర్పాట్లు జరిగిపోయాయి.
UP:అబ్బాస్ హైదర్, అందాలిప్ జహ్రా జంటకు మతాచారాల ప్రకారం వివాహం జరిపించేశారు. అంతా ఆన్‌లైన్‌లోనే అన్నమాట. అక్కడ, ఇక్కడ జంట చేయాల్సిన తంతును మత పెద్దలతో కానిచ్చేశారు. ఇదో వింత అనిపించినా, పరిస్థితులు అనుకూలించక, పెళ్లి గడియలు మించిపోక ముందే జరిపించాలన్న పెద్దల నిర్ణయంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. మరి త్వరలో ఆ జంట ఒక్కటవ్వాలని కోరుకుందాం.