U-19 Boxing: న్యూఢిల్లీలో జరిగిన అండర్–19 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు ఏకంగా 17 పతకాలు సొంత చేసుకున్నాడు. టీనేజ్ మహిళా బాక్సర్లు పార్థవి, వన్షిక స్వర్ణాలు సాధించగా మహిళల 65 కేజీల ఫైనల్లో పార్థవి 5–0తో హాలెండ్ బాక్సర్ ఆలియా హోపెమా ఓడించి పతకం అందకుంది. పతకాలు అందుకున్నవారిలో క్రిషా వర్మ 75 కేజీల విభాగంలో బంగారు పతకం గెలిచింది. 5 కేజీల విభాగంలో నిషా, 54 కేజీల విభాగంలో, 80 కేజీల విభాగంలో కృతిక ,48 కేజీల విభాగంలో చంచల్, 57 కేజీల విభాగంలో అంజలి, 60 కేజీల విభాగంలో వినీ, 70 కేజీల విభాగంలో ఆకాంక్ష సిల్వర్ మెడల్స్ అందకున్నారు.
ఇది కూడా చదవండి: Team India: ‘దులీప్’ను మరిచిన ఫలితమే ఇది
పురుషుల విభాగంలో ఏకైక పసిడి పతకాన్ని హేమంత్ సాధించగా.. 75 కేజీల విభాగంలో రాహుల్ కుందు రజతం, 50 కేజీల విభాగంలో రిషి సింగ్, 55 కేజీల విభాగంలోక్రిష్ పాల్, 70 కేజీల విభాగంలో సుమిత్, 85 కేజీల విభాగంలో ఆర్యన్, ప్లస్ 90 కేజీల విభాగంలో లక్షయ్ రాఠి కాంస్య పతకాలు సాధించారు.