Indian Americans: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. త్వరలో ఆయన అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. అయితే ట్రంప్ క్యాబినెట్లో ఇండియన్ అమెరికన్స్‌కు కీలక పదవులు దక్కొచ్చు. వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ, తులసీ గబ్బార్డ్‌కు ప్రాధాన్యం ఇవ్వడం గ్యారంటీ. వివేక్‌కు VC పదవిని ఆఫర్ చేసేందుకు వెనకాడనన్న ట్రంప్ అతడి తెలివితేటలకు ఫిదా అయ్యారు. ఇక ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో తులసి పాత్ర కీలకం. దాదాపుగా ఆయన స్పీచుల్ని ఆమే రాశారు. ప్రజలను ఆలోచింపజేసేలా ఆమె రైటింగ్స్ ఉంటాయి. ఇక హేలీకి రాజకీయ అనుభవం ఎక్కువ.
2017లో అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ 2021లో బైడెన్ చేతిలో ఓడారు. ఓటమిని అంగీకరించలేక ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. ఆ నిరసనల్లో అల్లర్లు జరిగి ఆయనపై కేసులయ్యాయి. ఓ పోర్న్‌స్టార్‌కు ట్రంప్ డబ్బిచ్చిన కేసు సహా 34 కేసుల్లో దోషిగా తేలారు. దీంతో ట్రంప్ కథ ముగిసిందని భావించారు. కానీ మళ్లీ అధ్యక్ష బరిలోకి దిగారు. ప్రచారంలో ఆయనపై కాల్పులూ జరిగాయి. కట్ చేస్తే ఇప్పుడు 47వ ప్రెసిడెంట్ అవుతున్నారు.
ఇది కూడా చదవండి: Donald Trump: ట్రంప్ గెలిచేశాడు.. 47వ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక
Indian Americans: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం పొందడంతో డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడా కన్వెన్షన్ సెంటర్‌లో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన భార్య మెలానియా ట్రాంప్‌ను కౌగలించుకొని ముద్దు పెట్టి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో తనకు మద్దతుగా ఉంటూ విజయం కోసం ఎంతో కష్టపడి పనిచేశారని ఆయన కొనియాడారు. చనిపోయిన మెలానియా తల్లి కూడా ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉండి ఉంటారని చెప్పుకొచ్చారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన డొనాల్డ్ ట్రంప్‌కు కుటుంబసభ్యులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మనవరాలైన కై మాడిసన్ ట్రంప్ విషెస్ తెలిపారు. ‘అమెరికన్ల కోసం మీలా ఎవరూ కష్టపడి పని చేయరు. అభినందనలు తాత, ఐ లవ్ యూ’ అని ట్వీట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ -వెనెస్సా కుమార్తెనే ఈ కై. చదువుకుంటూనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారారు.