Indian Air Force: ఆపరేషన్ సిందూర్ కార్యక్రమం ఇంకా ముగిసిపోలేదు.. అని ఇండియన్ ఎయిర్‌లైన్స్ (ఐఏఎఫ్) సంచలన ప్రకటన విడుదల చేసింది. భారత్-పాక్ ఉద్రిక్తతల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇరుదేశాలు నిన్న (మే 10) కాల్పుల విరమణను ప్రకటించాయి. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ పాటిస్తున్నట్టు ప్రకటించాయి. అయితే కాల్పుల విరమణ అనంతరం కూడా పాక్ వైపు నుంచి కాల్పులు జరగడం గమనార్హం. ఈ దశలో ఐఏఎఫ్ ప్రకటన సంచలనంగా మారింది.
Indian Air Force: ఆపరేషన్ సిందూర్‌పై ఊహాగానాలను ఎవరూ నమ్మవద్దని ఐఏఎఫ్ ఆ ప్రకటనలో కోరింది. ఆపరేషన్ సిందూర్ కార్యక్రమంలో భాగంగా తమకు అప్పగించిన పనిని అత్యంత కచ్చితత్వంతో విజయవంతంగా పూర్తిచేశామని పేర్కొన్నది. భారత్-పాక్ మధ్య సీజ్ ఫైర్ కుదిరిన వేళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఈ ప్రకటన సంచలనంగా మారింది.