Hockey Asia Cup 2025: ఆసియా కప్‌లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుతంగా రాణించి జపాన్‌పై 3-2 తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ సూపర్ 4స్ దశకు అర్హత సాధించింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్‌తో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మరో గోల్‌ను మన్‌దీప్ సింగ్ సాధించాడు.మ్యాచ్ ప్రారంభంలోనే భారత జట్టు దూకుడుగా ఆడింది. నాలుగో నిమిషంలో మన్దీప్ సింగ్ ఒక అద్భుతమైన ఫీల్డ్ గోల్ చేసి భారత్‌ను 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.
మన్దీప్ గోల్ చేసిన నిమిషంలోనే, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించి భారత్ ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. మూడవ క్వార్టర్‌లో జపాన్ జట్టు కవాబే కోసేయ్ ద్వారా ఒక గోల్ చేసి స్కోరును 2-1కి తగ్గించింది.
ఇది కూడా చదవండి: Asia Cup 2025: ఫిట్‌నెస్ పరీక్షలో నెగ్గిన రోహిత్ శర్మ
నాలుగో క్వార్టర్‌లో మరోసారి హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని 3-1కి పెంచాడు. జపాన్ చివరి నిమిషంలో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, భారత డిఫెన్స్ వారిని అడ్డుకుంది.ఈ విజయం ద్వారా భారత్ పూల్ Aలో అగ్రస్థానంలో నిలిచింది.
మొదటి మ్యాచ్‌లో చైనాపై 4-3 తేడాతో విజయం సాధించిన భారత్, ఈ టోర్నమెంట్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్ Aలో అగ్రస్థానంలో నిలిచి, సూపర్ 4స్ దశకు అర్హత సాధించింది. ఇప్పుడు భారత్ తన చివరి పూల్ A మ్యాచ్‌లో కజకిస్తాన్‌తో తలపడనుంది. ఈ విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని చెప్పవచ్చు.