india vs pakistan: భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య సరిహద్దుల వెంట జరిగిన యుద్ధంలో తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ జవాన్ వీరమరణం పొందారు. పాక్ జరిపిన కాల్పుల్లో ఆ జవాన్ మృతిచెందినట్టు భారత్ ఆర్మీ ప్రకటించింది. దేశరక్షణ కోసం మురళీనాయక్ ప్రాణాలర్పించారని పేర్కొన్నది. ఆ జవాన్‌ది ఆంధ్రప్రదేశ్ సొంత రాష్ట్రం.
india vs pakistan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీనాయక్ జమ్ము కశ్మీర్‌లోని సరిహద్దుల్లో పాక్ జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందారు. ఆయన మరణవార్త తెలియడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బంధుమిత్రులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. మే 10న మురళీనాయక్ పార్థివదేహాన్ని కల్లితండాకు తరలించనున్నారు.