India vs New zealand: న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ తొలి రోజు వర్షం కారణంగా రద్దైంది. ఇప్పుడు రెండో రోజు ఆటలో తన ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా రెండంకెల స్కోరును సేకరించేలోపే టాప్ ఆర్డర్ మూడు వికెట్లు కోల్పోయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది . ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు శుభారంభం లభించలేదు.
కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 2 పరుగులు చేసి టిమ్ సౌథీ చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో వెనువెంటనే విరాట్ కోహ్లీ (0) కూడా సున్నాతో పెవిలియన్ బాట పట్టాడు. శుభమాన్ గిల్ స్థానంలో జట్టులో అవకాశం దక్కించుకున్న సర్ఫరాజ్ ఖాన్ (0) కూడా సున్నా స్కోరు చేసి నిరాశపరిచాడు. అంటే కేవలం 13 పరుగులకే భారత జట్టు 3 ముఖ్యమైన వికెట్లు కోల్పోయింది. ఈ ముగ్గురిలో ఇద్దరు డకౌట్ కావడం విశేషం. భారత జట్టు లంచ్‌కు 34 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.