IND vs ENG: ఇంగ్లాండ్ తో జరిగే నాల్గవ టెస్ట్ మ్యాచ్ కు టీం ఇండియా సన్నద్ధమవుతోంది. బుధవారం మాంచెస్టర్ లో ప్రారంభమయ్యే మ్యాచ్ లో గెలవడమే లక్ష్యంగా టీం ఇండియా బరిలోకి దిగనుంది. ఐదు టెస్ట్ సిరీస్ లలో ఒకే ఒక్క సిరీస్ గెలిచిన భారత్ 1-2 తేడాతో వెనుకబడి ఉంది. సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే టీం ఇండియా ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం.
అయితే, ఈ మ్యాచ్ కు ముందు నుండే టీం ఇండియా గాయాలతో బాధపడుతోంది. నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్ దీప్ సింగ్, ఆకాష్ దీప్ లతో పాటు నాల్గవ టెస్ట్ మ్యాచ్ కు దూరం అయ్యారు. గత మూడు టెస్టుల్లో కుల్దీప్ యాదవ్ బెంచ్ కే పరిమితమయ్యాడు. కానీ నాలుగో టెస్టులో అతను ఆడే అవకాశం ఉంది. ఆకాశ్ దీప్, అర్ష్ దీప్ సింగ్ గాయాల కారణంగా బౌలింగ్ విభాగం బలహీనంగా ఉంది. కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకోవడం ద్వారా ఆ లోటును పూడ్చాలని టీం ఇండియా మేనేజ్ మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Wedding Dates: జులై 25వ తేదీ నుంచి పెళ్లి ముహూర్తాలు.. తేదీలు ఇవే!
జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తుది జట్టులో కొనసాగనుండగా, ఆకాష్ దీప్ స్థానంలో అన్షుల్ కాంబోజ్ అరంగేట్రం చేయనున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో కుల్దీప్ యాదవ్ ఆడనున్నాడు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్‌గా ఎంపికవుతాడు. రిషబ్ పంత్ బ్యాట్స్‌మన్‌గా మాత్రమే ఆడతాడు. మిగిలిన బ్యాటింగ్ ఆర్డర్‌లో పెద్దగా మార్పులు ఉండవు. మూడు టెస్టుల్లో విఫలమైన కరుణ్ నాయర్‌ను గంభీర్-గిల్ పక్కన పెట్టాలనుకుంటే, సాయి సుదర్శన్ , అభిమన్యు ఈశ్వరన్‌లను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చుతారు.